మిల్క్ బ్యూటీని ఇబ్బంది పెట్టబోతున్న ఇండియన్ మైకేల్ జాక్సన్

మిల్క్ బ్యూటీని ఇబ్బంది పెట్టబోతున్న ఇండియన్ మైకేల్ జాక్సన్

Published on Feb 9, 2016 2:18 PM IST

tamanna-and-prabhu-deva
తమన్నా మంచి నటే కాదు మంచి డాన్సర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో మంచి డాన్సర్ అని కితాబు అందుకున్న తమన్నారీసెంట్ గా రిలీజ్ అయిన స్పీడున్నోడు సినిమా లో కూడా తన డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. స్క్రీన్ పైనే కాదు స్టేజ్ పైన కూడా డాన్స్ లతో అదరగొట్టే తమన్నా ఇప్పుడు ఒక వ్యక్తి తో డాన్స్ చేయాల్సి వస్తుండటం తలుచుకొని నెర్వస్ గా ఫీలవుతొందట. ఆ వ్యక్తి మరెవరో కాదు ఇండియన్ మైకేల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవా.

తమన్నా ప్రధాన పాత్రలో తెలుగు, తమిళ్ మరియు హిందీలో భాషల్లో ఓ త్రిభాషా చిత్రం ఇటీవలే సెట్స్ పైకి వెళ్ళిన సంగతి మీకు ఇదివరకే తెలిపాం. ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని డాన్స్ మాస్టర్ గా, దర్శకుడిగా, నటుడిగా తన లోని టాలెంట్ చూపిన ఇండియన్ మైఖేల్ జాక్సన్
ప్రభుదేవా నిర్మిస్తున్నాడు. నిర్మాతగానే కాకుండా ప్రభుదేవా కూడా ఇందులో నటిస్తున్నాడు. ప్రభుదేవాతో చేయడం థ్రిల్లింగ్ గా ఉన్నా తనతో డాన్స్ చేయాల్సి వస్తే మాత్రం ఇబ్బంది పడతానని తమన్నా అన్నారు. ‘ఇటీవలే ప్రభుదేవా, నాపై ఫోటో షూట్ చేసారు, మా జోడీ బాగా కుదిరింది. మెయిన్ గా ప్రభుదేవాతో సమానంగా డ్యాన్స్ చేయడం నాకో ఛాలెంజ్. ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు, అద్భుతమైన కథ అని’ తమన్నా తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు