రెమ్యునరేషన్ రహస్యాన్ని బయటపెట్టిన తమన్నా

రెమ్యునరేషన్ రహస్యాన్ని బయటపెట్టిన తమన్నా

Published on Sep 28, 2016 5:00 PM IST

tamanna-67
సౌత్ ఇండియా టాప్ హీరోయిన్లలో ఒకరైన తమన్నా వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాక భారీ బడ్జెట్ సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఆఫర్లు వచ్చినా తమన్నా వదలకుండా చేసేస్తోంది. స్టార్ హీరోయిన్ అయిన ఆమె ఒక్క ఐటం సాంగ్ చేయడానికి భారీ స్థాయిలో రెమ్యునరేషన్ వసూలు చేస్తుందని వార్తలొచ్చాయి. ఇదే విషయాన్ని ‘అభినేత్రి’ ప్రమోషన్లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో ఆమెను అడగ్గా తమన్నా గట్టి సమాధానమే చెప్పింది.

సినిమాలో ఒక్క ఐటమ్ పాట చేయడానికి పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ తీసుకుంటానని మొహమాటపడకుండా చెప్పేసింది. ‘బాహుబలి’ సినిమా విజయవంతం అవడంతో తమన్నా స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమె ఛార్జ్ చేసే రెమ్యునరేషన్ కూడా బాగా పెరిగింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ కుమార్ గౌడ హీరోగా పరిచయమవుతున్న ‘జాగ్వార్’ సినిమాలో ఐటమ్ సాంగ్ చేస్తోంది. అలాగే తెలుగు, తమిళ్, హిందీ మూడు భాషల్లో ఒకేసారి విడుదలకానున్న ‘అభినేత్రి’ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు