‘బాహుబలి’ కోసం 6 కిలోల బరువు తగ్గిన తమన్నా

‘బాహుబలి’ కోసం 6 కిలోల బరువు తగ్గిన తమన్నా

Published on Dec 22, 2014 2:00 PM IST

tamanna

‘బాహుబలి’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా అవంతిక పాత్రలో యువరాణిగా నటిస్తుంది. తమన్నా పుట్టినరోజు సందర్భంగా ‘బాహుబలి’ టీం విడుదల చేసిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అవంతిక లుక్ లు అద్బుత స్పందన లభించింది. అవంతిక పాత్రలో పాలరాతి శిల్పంలా కనిపించడానికి కాస్త శ్రమించానని చెప్తుంది తమన్నా.

ఇప్పటివరకూ ప్రేక్షకులు నన్ను గ్లామరస్ క్యారెక్టర్ లలో చూశారు. చారిత్రాత్మక యుగానికి చెందిన అవంతిక పాత్రలో కొత్త తమన్నాను చూస్తారు. కాస్ట్యూమ్స్, ఆభరణాలు ఇలా అవంతిక పాత్రకు సంబంధించి చాలా ఆలోచించాం, రీసెర్చ్ చేశాం. దర్శకుడు రాజమౌళి ఆరు కిలోలు బరువు తగ్గాల్సిందిగా సూచించారు. వర్కౌట్స్, డైట్ ఫాలో కావడం ద్వారా నేను బరువు తగ్గాను అని తమన్నా తెలిపారు.

ఈ సినిమా కోసం తమన్నా హార్స్ రైడింగ్, కత్తి యుద్దాలలో శిక్షణ తీసుకుంది. రిస్కీ స్టంట్స్ చేస్తుంది. ఇప్పటివరకూ నటించని కొత్త పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం బల్గేరియాలో ప్రభాస్ తో కలసి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో తమన్నా పాల్గొంటుంది. 2015 వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు