ఆ క్రేజీ రీమేక్ లో సత్యదేవ్ కి జంటగా తమన్నా

ఆ క్రేజీ రీమేక్ లో సత్యదేవ్ కి జంటగా తమన్నా

Published on Jul 14, 2020 12:59 PM IST

హీరో సత్యదేవ్ ఓ క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన కన్నడ హిట్ మూవీ రీమేక్ లో నటించనున్నారు. ఇటీవల విడుదలై మంచి విజయం దక్కించుకున్న లవ్ మోక్టైల్ మూవీ తెలుగు రీమేక్ లో సత్యదేవ్ నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా సత్యదేవ్ కి జంటగా నటించడం మరో విశేషం. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శేఖర మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీతం కాల భైరవ అందిస్తుంటారు.

ఇక ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఇటీవల సత్యదేవ్ నటించిన 47డేస్ అనే థ్రిల్లర్ ఓ టి టి లో విడుదలైనది. త్వరలో ఆయన నటించిన ఉమామహేశ్వర ఉగ్రరూపశ్య మూవీ రేపటి నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. కేర్ ఆఫ్ కంచర పాలెం ఫేమ్ మహా వెంకటేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ మలయాళ హిట్ చిత్రం మహేసింతే ప్రతీకారం కి తెలుగు రీమేక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు