ఆ సినిమా ‘బాహుబలి-2’ కంటే గొప్పగా ఆడుతుందని బెట్ కడుతున్నారు !

ఆ సినిమా ‘బాహుబలి-2’ కంటే గొప్పగా ఆడుతుందని బెట్ కడుతున్నారు !

Published on Mar 22, 2017 9:27 PM IST


‘బాహుబలి – 2’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఉన్న భారీ అంచనాలు, క్రేజ్ వలన ఈ సినిమాతో పోటీ పడేందుకు ఏ భారతీయ చిత్రం కూడా ముందుకురావడం లేదు. అన్నీ సినిమాలు పక్కకు తప్పుకుని 28వ తేదీని బాహుబలికి అప్పగించేశాయి. అంతటి హైప్ ఉన్న చిత్రం పై తమిళ డిస్ట్రిబ్యూటర్ ఒకరు బెట్ కడుతానంటున్నారు. ఆ సంగతేమిటో చూస్తే ఈరోజు తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేసిన ‘ పవర్ పాండి’ ట్రైలర్ విడుదలైంది.

ఈ సందర్బంగా తమిళ పరిశ్రమలోని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కె. రాజన్ ‘ నేను ధనుష్ అభిమానిని. ఆయన వరుసగా ఇచ్చినన్ని హిట్లు మరే హీరో ఇవ్వలేదు. ఆయన డైరెక్ట్ చేసిన ఈ సినిమా చాలా గొప్పగా అందుతుందని నేను బెట్ కట్టి మరీ చెబుతాను. ఇంకా చెప్పాలంటే బాహుబలి 2 కన్నా దీని మీదే నాకు ఎక్కువ నమ్మకంగా ఉంది’ అన్నారు. ఇంతలా ధనుష్ సినిమాని ఆకాశానికెత్తడానికి బాహుబలిని ఉదాహరణగా చూపిన ఆ డిస్ట్రిబ్యూటరే ‘బాహుబలి-2’ యొక్క తమిళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను దక్కించుకొని ఉండటం ఇక్కడ కోస మెరుపు. ‘పవర్ పాండి’ ఏప్రిల్ 14న రిలీజ్ కానుండగా ‘బాహుబలి-2’ ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు