తమిళ హీరో ఆశలన్నీ మహేష్ చిత్రం పైనే..!

తమిళ హీరో ఆశలన్నీ మహేష్ చిత్రం పైనే..!

Published on Jan 24, 2017 11:17 AM IST

bharat
తమిళ హీరో ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రస్తుతం మహేష్ – మురుగదాస్ ల చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.తాజాగా జాతీయ వార్త సంస్థతో జరిగిన ఇంటర్వ్యూ లో భరత్ ఈ చిత్రం గురించిన విషయాలను వెల్లడించాడు. మహేష్ బాబుతో కలసి నటించడం సంతోషంగా ఉందని భరత్ అన్నాడు.

ఈ చిత్రంపైనే భరత్ ఆశలన్నీ పెట్టుకుని ఉన్నాడు. ఈ చిత్రం ద్వారా తనకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయని, తన మార్కెట్ పెరుగుతుందని భావిస్తున్నాడు. ఈ చిత్రం లో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపిస్తుండగా మరో నెగిటివ్ రోల్ లో భరత్ నటిస్తున్నాడు. తెలుగు – తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఠాగూర్ మధు, ఎన్ వి ప్రసాద్ లు ఈ చిత్రాన్ని భారీ స్థాయి లో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు