సాయిధరమ్ తేజ్ సినిమాలో పాట పాడిన తమిళ స్టార్!

dhanush
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘తిక్క’ సినిమా కొద్దిరోజులుగా మంచి క్రేజ్ తెచ్చుకుంటోన్న విషయం తెలిసిందే. ఆగష్టు 13న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాకు తాజాగా ఓ ప్రత్యేకత వచ్చి చేరింది. అదే తమిళ సూపర్ స్టార్ ధనుష్ ఈ సినిమాలో ఓ పాట పాడడం. థమన్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోలో ధనుష్ పాడిన పాట మేజర్ హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ మధ్యాహ్నమే ధనుష్-థమన్ కలిసి ఈ పాట రికార్డింగ్ కూడా పూర్తి చేశారు.

గతంలో తాను హీరోగా నటించిన చాలా సినిమాల్లో పాటలు పాడిన ధనుష్, ఇలా ఓ తెలుగు హీరో కోసం ప్రత్యేకంగా పాట పాడడం విశేషంగా చెప్పుకోవచ్చు. కొన్నేళ్ళ క్రితం ధనుష్ పాడిన ‘కోలవెరి’ డి అనే పాట అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించిన విషయం విదితమే. ఇక ‘తిక్క’ సినిమా విషయానికి వస్తే సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను సి. రోహిణ్ రెడ్డి నిర్మించారు.

 

Like us on Facebook