చెన్నై-ముంబై చక్కర్లు కొడుతోన్న తాప్సీ!

చెన్నై-ముంబై చక్కర్లు కొడుతోన్న తాప్సీ!

Published on Mar 31, 2015 8:28 AM IST

Tapsee1

‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన తాప్సీ, తన విలక్షణమైన నటన, మ్యానరిజంతో తెలుగులో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. తెలుగులో బిజీగా ఉన్న సమయంలోనే బాలీవుడ్‌లో కొన్ని అవకాశాలు ఆమెను వరించాయి. ‘చష్మే బద్దూర్’ రీమేక్ అందులో ఒకటి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి మార్కులే తెచ్చుకుంది. కాగా.. ఈ సినిమా తర్వాత తాప్సీకి బాలీవుడ్‌లో ఓ భారీ ఆఫర్ వరించింది. విలక్షణ దర్శకుడు నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘బేబీ’ సినిమాయే అది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాలో తాప్సీది కీలక పాత్ర. ఈ సినిమాలో ఆమె సరికొత్తగా కనిపించడంతో పాటు యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకుంది.

ఇక ‘బేబీ’ విజయం తర్వాత తాప్సీ బాలీవుడ్‌లో బిజీ అయిపోయిందనే చెప్పాలి. ప్రస్తుతం ఒక చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా మరొకటి త్వరలో మొదలుకానుంది. ఇదే సమయంలో ఆమెను వరుస తమిళ అవకాశాలూ చుట్టు ముట్టాయి. అందులో ఓ సినిమాకు తాప్సీ ఓకే చెప్పింది కూడా. దీంతో రెండు సినిమాల షూటింగ్ డేట్స్ వెనువెంటనే ఉండడతో చెన్నై-ముంబై చక్కర్లు కొడుతోంది తాప్సీ. ఇప్పటికే ఆమె తమిళంలో నటించిన సినిమా ‘కాంచన 2’ విడుదలకు సిద్ధమౌతోండగా, మరో బాలీవుడ్ సినిమా రన్నింగ్‌షాదీ.కాం పూర్తి కావచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు