తీవ్ర విషాదంలో హీరోయిన్ తాప్సీ!

తీవ్ర విషాదంలో హీరోయిన్ తాప్సీ!

Published on May 30, 2020 10:46 PM IST

హీరోయిన్ తాప్సీ బామ్మ మృతి చెందడంతో తాప్సీ ఫ్యామిలీ అంతా తీవ్ర శోకంలో మునిగిపోయారు. దీనికి సంబంధించి తాప్సీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ‘‘ఫ్యామిలీలోని పాత తరాల వారు ఎప్పటికీ నిలిచిపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు’’ అని తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.

ఆ పోస్ట్ తో పాటు గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు సంబంధించిన ఫోటోను కూడా తాప్సీ పోస్ట్ చేసింది. 123తెలుగు.కామ్ తరఫున తాప్సీ బామ్మ పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

https://www.instagram.com/p/CAztfdLJ2j8/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు