బేబీ’ షూటింగ్ ఫినిష్ చేసిన తాప్సి.

బేబీ’ షూటింగ్ ఫినిష్ చేసిన తాప్సి.

Published on Oct 21, 2014 9:02 PM IST

TApsee
అక్షయ్ కుమార్, తాప్సి జంటగా నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందుతున్న హిందీ సినిమా ‘బేబీ’. దగ్గుబాటి రానా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. సోమవారంతో తన షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసింది తాప్సి. ఈ సినిమాలో తాప్సి ప్రియా పాత్రలో కనిపించనుంది.

‘స్వీట్ థాంక్ యు ఫ్రం ‘బేబీ’ టీం. అఫీషియల్ గా ప్రియా షూటింగ్ కంప్లీట్ అయ్యింది’ అని సోషల్ మీడియాలో తాప్సి ఒక ఫోటో పోస్ట్ చేసింది. తాప్సి షూటింగ్ కంప్లీట్ చేసిన సందర్భంగా యూనిట్ కేకు కట్ చేసి గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇచ్చారు.

ఈ సినిమా తన కెరీర్ కు బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని చెప్తుంది. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయడం కంటే ‘బేబీ’ లాంటి సినిమా ఒక్కటి చేసినా చాలు అంటుంది. ఈ సినిమా తన కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు