మల్టీ స్టారర్ కు సై అంటున్న తారక్!


ఎన్టీఆర్ ఈ నెల 21న రిలీజ్ కానున్న తన సినిమా ‘జై లవ కుశ’ కోసం ఎన్నడూ లేనంత విధంగా విరివిగా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ప్రింట్, వెబ్, టీవీ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ ఇంటర్వ్యూల సందర్బంగా ఆయన అనేక కొత్త విషయాల్ని బయటపెట్టారు. వాటిలో ఇతర హీరోలతో, వాళ్ళ సినిమాలతో పోటీ, వాళ్ళతో సాన్నిహిత్యం, కొత్తదనానికి తగ్గట్టు మారడం వంటి అంశాలు ఆసక్తికరంగా మారాయి.

హీరోల మధ్య, వాళ్ళ సినిమాలు మధ్య పోటీ ఉండాలని, కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి కానీ నష్టాలకు దారితీయకూడదు. ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళదని చెప్పిన తారక్ మంచి కథలు లభించి, సామర్థ్యం ఉన్న దర్శకుడు దొరికితే వేరే హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి తానెప్పుడూ సిద్దమేనని అన్నారు. అలాగే ప్రస్తుతానికైతే తమిళ మార్కెట్ కు వెళ్లే ఆలోచన లేదని కూడా అన్నారు. మరి తారక్ స్టేట్మెంట్ విన్న దర్శకులు ఆయనను మెప్పించే విధంగా కథల్ని ఎప్పుడు తయారుచేస్తారో చూడాలి.

 

Like us on Facebook