త్వరలో పెళ్లి పీఠలెక్కనున్న తరుణ్ !

త్వరలో పెళ్లి పీఠలెక్కనున్న తరుణ్ !

Published on Jan 16, 2018 12:25 PM IST


ఒకప్పుడు హీరో తరుణ్ కు లవర్ బాయ్ ఇమేజ్ తో యువతలో మంచి ఫాలోయింగ్ ఉండేది. కుర్రకారంతా మీ ఫెవికారెట్ హీరోల లిస్ట్ చెప్పండి అంటే అందులో తరుణ్ పేరును ఖచ్చితంగా చేర్చుకునే వారు. కానీ ఈ మధ్య కాలంలో సరైన సినిమాలు లేకపోవడంతో ఆయన ఫామ్ కొద్దిగా తగ్గింది. తాజాగా అయన ‘ఇది నా లవ్ స్టోరీ’తో పేరుతో త్వరలో ప్రేక్షకుల్లోకి రానున్నారు.

ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది. ఇకపోతే తరుణ్ త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడని ఆయన తల్లి, నటి రోజారమణి తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ప్రస్తుతం అతని కోసం అన్ని విధాలా సరిపోయే అమ్మాయి కోసం వెతుకుతున్నామని అన్నారు. దీన్నిబట్టి త్వరలోనే తరుణ్ పెళ్లి పీఠలెక్కబోయే దృశ్యాన్ని చూడొచ్చని అర్థమవుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు