కొత్తవాళ్ళే కావాలంటున్న తేజ !

కొత్తవాళ్ళే కావాలంటున్న తేజ !

Published on Jan 23, 2018 12:06 PM IST


దర్శకుడు తేజ చేస్తున్న రెండు చిత్రాల్లో ఒకటి విక్టరీ వెంకటేష్ చిత్రం కూడా ఉంది. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ ప్రొఫెసర్ గా కనిపించనున్నాడు. ఫ్యామిలీ థ్రిల్లర్ గా ఉండనున్న ఈ చిత్రంలో ప్రధాన తారాగణం మినహా మిగతా నటీ నటులందరూ కొత్త వాళ్ళే ఉండేలా చూసుకుంటున్నారు తేజ.

ఇందులో ఒక కీ రోల్ కోసం నారా రోహిత్ ను ఇంతకు ముందే ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ కథల్ని దూరం పెట్టి భిన్నత్వం ఉన్న స్క్రిప్ట్స్ ను మాత్రమే ఒప్పుకుంటున్న వెంకటేష్ చేస్తున్న చిత్రం కావడంతో ఇందులో ఎలాంటి కొత్తదనం ఉంటుందో చూడాలని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. త్వరలోనే ఈ చిత్రం యొక్క రెగ్యులర్ షూట్ మొదలుకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు