కరోనా ఎఫెక్ట్.. టాలీవుడ్ కి భారీగానే నష్టం !

కరోనా ఎఫెక్ట్.. టాలీవుడ్ కి భారీగానే నష్టం !

Published on Mar 22, 2020 11:59 PM IST

కరోనా దెబ్బకి ప్రపంచం అల్లడిపోతుంది. ఇప్పటికే కరోనా వైరస్ టాలీవుడ్ పరిశ్రమను టెంక్షన్లో పడేసింది. ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి. అయితే ఏప్రిల్ మొదటి తేదీ వరకూ షూటింగ్స్ వాయిదా వేయాలని అనుకున్నప్పటికీ ఇప్పుడు అది ఇంకా పొగడించే అవకాశం కనిపిస్తోంది. బంద్ తో పాటు సామాజిక దూరంను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ లను పోస్ట్ ఫోన్ చేయాల్సిందిగా పలువురు కోరుకుతున్నారు. కానీ ఈ కరోనా ఏప్రిల్ లోపు అదుపులోకి రాకపోతే టాలీవుడ్ కి భారీగా నష్టం.

సినిమాల విడుదల తేదీలు ఇంకా వెనక్కు వెళ్ళే పరిస్ఠితి వస్తోంది. ఇవి చాలవన్నట్టు రెండు స్టేట్స్ లో థియేటర్లు కూడా మూసి వేస్తారు. ఇప్పటికే ఈ పరిణామంతో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యాజమాన్యాలు ఇరుకునపడ్డారు. వీలైనంత త్వరగా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ ని నిర్వహించిన సంగతి తెలిసిందే. కరోనా సోకకుండా ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండి మరియు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ఆదేశిస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు