ఇంటర్వ్యూ : సూర్య – ఇండియాలోని భాషల్లో తెలుగే ఎంతో అందమైన భాష !

ఇంటర్వ్యూ : సూర్య – ఇండియాలోని భాషల్లో తెలుగే ఎంతో అందమైన భాష !

Published on Jan 7, 2018 1:09 PM IST

తమిల్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘తాన సెరంద కూట్టం’ తెలుగులో ‘గ్యాంగ్’ పేరుతో ఏ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా సూర్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం.

ప్ర) మీ ‘గ్యాంగ్’ గురించి చెప్పండి ?
జ) నాకు ఇదొక స్పెషల్ సినిమా. నా యంగర్ డేస్ ను నాకు గుర్తుచేసింది. చాలా రోజుల తర్వాత కొత్త తరహా సినిమాను చేశాననే ఫీలింగ్ కలిగింది.

ప్ర) అసలు ఈ సినిమా దేని గురించి ?
జ) 1980లో జరిగిన పెద్ద రాబరీకి సంబందించిన నిజమైన ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. అంతేగాక ఇండియాలోనే పెద్ద సమస్యగా మారింది ఇందులో దాన్ని కూడా టచ్ చేశారు.

ప్ర) మరి ‘స్పెషల్ 26’ కి ఇది పూర్తి స్థాయి రీమేక్ అంటున్నారు ?
జ) అంటే సబ్జెక్ట్ ఒకటే. కానీ డైరెక్టర్ విగ్నేష్ శివన్ సినిమాను ట్రీట్ చేసిన విధానం మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది.

ప్ర) ఈ సినిమాను చేసేలా మిమ్మల్ని ప్రేరేపించిన అంశాలేమిటి ?
జ) డైరెక్టర్ విగ్నేష్ శివన్ కథను చెప్పిన విధానం, సన్నివేశలాని, పాత్రల్ని, మాటల్ని రాసిన తీరు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ఆయన చేసే ప్రతి పనిలోను కొత్తదనం ఉంటుంది. అదే నను ఈ సినిమాకు ఒప్పుకునేలా చేసింది.

ప్ర) రమ్యక్రిష్ణ, కార్తిక్ లాంటి పెద్ద నటులతో నటించడం ఎలా ఉంది ?
జ) అదొక గొప్ప అనుభవం. రమ్యక్రిష్ణ, కార్తిక్ గార్ల నుండి చాలా నేర్చుకున్నాను. కార్తిక్ సర్ అయితే నాలుగు నిముషాల సన్నివేశాన్ని సింగిల్ టేక్ లో చేసేశారు. అలాగే లెజెండ్ కమెడియన్ సెంథిల్ గారితో వర్క్ చేయడం కూడా గొప్పగా ఉంది.

ప్ర) సొంత డబ్బింగ్ చెప్పడం ఎలా ఉంది ?
జ) దేశంలోని అందమైన భాషల్లో తెలుగు మొదటిది. అలాంటి భాషలో నాకు నేనే డబ్బింగ్ చెప్పడం చాలా బాగుంది. తమిళ్ డబ్ చెప్పడానికి 8 రోజులు పడితే తెలుగు 46 రోజుల్లో చెప్పేశాను. రాబోయే రోజుల్లో ఇంకా బాగా తెలుగు నేర్చుకుంటాను.

ప్ర) సినిమా ఏ బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది ?
జ) అంటే పర్టిక్యులర్ గా ఒక చోటని కాదు. వైజాగ్, హైదరాబాద్, చెన్నై వంటి చోట్ల జరుగుతుంది.

ప్ర) ‘అజ్ఞాతవాసి, జై సింహ’ లాంటి సినిమాలతో పోటీకి దిగుతున్నారు. ఎలా ఉంది ?
జ) పోటీ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణగారు ఇక్కడ పెద్ద హీరోలు. అయినా ‘అజ్ఞాతవాసి’ 10న వస్తే నా సినిమా 12న వస్తోంది. పండుగ సీజన్ కాబట్టి పెద్ద ఇబ్బందేం ఉండదు.

ప్ర) ఈ సినిమాలో ఇంకా ఏయే అంశాలు హైలెట్ గా ఉంటాయి ?
జ) హైలెట్ అంటే విగ్నేష్ శివన్ టేకింగ్ అనే చెప్పాలి. అలాగే అనిరుద్ సంగీతం కూడా చాలా బాగుంటుంది. అది కూడా సినిమాకు మంచి ప్లస్ పాయింట్ అవుతుంది.

ప్ర) మీ తర్వాతి సినిమాలేంటి ?
జ) సెల్వ రాఘవన్ తో ఒక సినిమా చేస్తున్నాను. అందులో సాయి పల్లవి, రకుల్ ప్రీత్ హీరోయిన్లు. ఆ తర్వాత కె.వి. ఆనంద్ తో ఒక సినిమా చేస్తాను.

ప్ర) మరి హరి, విక్రమ్ కుమార్ లతో చేస్తారని విన్నాం ?
జ) అవి కూడా ఉన్నాయి. కానీ ఇంకా డిస్కషన్స్ లోనే ఉన్నాయి. ఏదైనా ఫైనల్ అయ్యాకే చెప్పగలం.

ప్ర) నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్ తో వర్క్ చేయడం ఎలా ఉంది ?
జ) చాలా బాగుంది. ఏపి, తెలంగాణాలో థియేటర్స్ ఎక్కువగానే ఉంటాయి. రెండు పెద్ద సినిమాలు వస్తున్నా కూడా నా సినిమాకు

ప్ర) తమిళ రాజకీయాల గురించి మీ కామెంట్ ?
జ) ప్రసుతం రజనీగారు, కమల్ గారు ఎంటర్ అయ్యారు. పరిస్థితులన్నీ మారుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఏమైనా తమిళనాడు మళ్ళీ గొప్ప నాయకుల్ని చూడబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు