గుంటూరులో ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో..!

గుంటూరులో ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో..!

Published on Nov 26, 2014 11:33 AM IST

ntr-purijaganth
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న తాజా సినిమా ‘టెంపర్’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే నెలలో ఆడియో విడుదల జరగనుందని సమాచారం. అనూప్ రూబెన్స్ స్వరాలను సమకూర్చారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ ముచ్చటగా మూడోసారి జోడి కట్టింది. ఇటివలే గోవా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ రేపటి నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభం అవుతుంది. బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నోర ఫతేహి ఐటెం సాంగ్ లో సందడి చేయనుంది.

యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను 2015 సంక్రాంతికి విడుదల చేయనున్నారు. వక్కంతం వంశీ ఈ సినిమాకు కథ అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు