నేటి నుంచి ‘టెంపర్’ చివరి సాంగ్ షూట్

నేటి నుంచి ‘టెంపర్’ చివరి సాంగ్ షూట్

Published on Jan 26, 2015 1:42 PM IST

temper
యంగ్ టైగర్ ఎన్. టి.ఆర్ అంటే పవర్ఫుల్ డైలాగులతో పాటు అదిరిపోయే స్టెప్స్ కూడా గుర్తొస్తాయి. ప్రతి సినిమాలోనూ సరికొత్త స్టెప్పులతో అభిమానులను, సినీ ప్రేమికులను ఆకట్టుకునే ఎన్.టి.ఆర్ తన రాబోయే సినిమా టెంపర్ లో కూడా కొన్ని స్టైలిష్ స్టెప్పులతో ఆకట్టుకోనున్నాడు. ‘టెంపర్’ సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తయ్యింది. ఇక కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ మాత్రమే బాలన్స్ ఉన్నాయి. అలాగే ఈ సినిమాలో మిగిలి ఉన్న చివరి సాంగ్ షూట్ ని ఈ రోజు మొదలు పెట్టారు.

హైదరాబాద్ లో వేసిన ఓ స్పెషల్ స్థ లో ఈ సినిమాలోని చివరి సాంగ్ షూట్ ని మొదలు పెట్టారు. మరో మూడు నాలుగు రోజులు జరిగే ఈ సాంగ్ షూట్ తో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఆడియో ఆల్బమ్ ని జనవరి 28న రిలీజ్ చేయనున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎన్.టి.ఆర్ ని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా చూపిస్తున్న ఈ సినిమాకి వక్కంతం వంశీ కథని అందిచాడు. బ్లాక్ బస్టర్ బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి సెకండ్ వీక్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు