బాలీవుడ్ టాప్ స్టార్ కి తమన్ మ్యూజిక్.!

బాలీవుడ్ టాప్ స్టార్ కి తమన్ మ్యూజిక్.!

Published on Apr 19, 2015 2:25 PM IST

s-s-Thaman
నటుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యి ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా మారి తెలుగు మరియు తమిళ భాషల్లో అందరి స్టార్ హీరోలకి సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన యంగ్ అండ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్. ఇప్పటి వరకూ ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించి కెరీర్లో చాలా ఫాస్ట్ గా 50 సినిమాల మెయిలు రాయిని పూర్తి చేసుకున్న తమన్ ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో సినిమాలు చేసిన తమన్ మొదటి సారి బాలీవుడ్ లో మ్యూజిక్ చేయనున్నాడు.

బాలీవుడ్ లో సినిమా అంటే ఏదో చిన్నా చితకాది కాదు ఏకంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీసు బాద్షా సల్మాన్ ఖాన్ సినిమాకి మ్యూజిక్ చేసే అబంపార్ ఆఫర్ కొట్టేసాడు. తెలుగు సూపర్ హిట్ మూవీ కిక్ సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేసాడు. ఇప్పుడు తెలుగులోలానే కాకుండా హిందీలో కూడా కిక్ సినిమాకి సీక్వెల్ చేయనున్నారు. ఈ సినిమా కి మ్యూజిక్ చేసే అవకాశం తమన్ దక్కింది. మరి కొద్ది రోజుల్లో తమన్ కిక్ 2 టీంతో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొననున్నాడు. తమన్ ప్రస్తుతం తెలుగులో రవితేజ కిక్ 2, అఖిల్ సినిమా, రామ్ చరణ్ – శ్రీను వైట్ల సినిమా, రామ్ ‘పండగ చేస్కో’ సినిమాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు