ఆర్ ఆర్ ఆర్ లో ఆ ఫైట్ విజువల్ వండర్ అట..!

ఆర్ ఆర్ ఆర్ లో ఆ ఫైట్ విజువల్ వండర్ అట..!

Published on Mar 23, 2020 7:52 AM IST

రాజమౌళి నుండి వస్తున్న మరో భారీ చిత్రం ఆర్ ఆర్ ఆర్. టాలీవుడ్ లో టాప్ స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, చరణ్ చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్ర చేస్తున్నారు. ఇక ఈ మూవీపై దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొని ఉండగా, అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ గురించి మరో ఆసక్తికర విషయం బయటికి వచ్చింది.

ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నవాబుల ఆయుధ సామగ్రి తీసుకెళుతున్న ట్రైన్ పై తన సైన్యంతో దాడి చేస్తారట. నవాబుల ఆయుధాలను దోచుకెళ్లే క్రమంలో వచ్చే ఈ పోరాట సన్నివేశం విజువల్ వండర్ లా ఉండడం ఖాయం అట. అబ్బురపరిచే విజువల్స్ తో ఈ ఫైట్ ని అద్భుతంగా తీర్చిదిద్దాలని జక్కన్న ప్లాన్ లో ఉన్నారట. ఈ ఫైట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు, సినీ ప్రేమికులకు గొప్ప అనుభూతిని పంచడం ఖాయం అని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు