రక్షకుడిగా ఆకట్టుకుంటున్న ‘సుధీర్ బాబు’ !

రక్షకుడిగా ఆకట్టుకుంటున్న ‘సుధీర్ బాబు’ !

Published on Jan 27, 2020 11:39 AM IST

నాని ప్రస్తుతం మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ సినిమా నుండి సుధీర్ బాబు ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం. ఫస్ట్ లుక్ లో సుదీర్ బాబు భయంకరమైన యాక్షన్ లుక్ తో ఆకట్టుకున్నాడు. మొత్తానికి ఈ లుక్ సినిమా పై ఉత్సుకతను మరింత పెంచుతుంది.

ఇక ఇందులో నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ వయలెన్స్ బేస్డ్ మూవీగా ఉండనుంది. ఇందులో మరొక హీరో సుధీర్ బాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈయనది ఇందులో పాజిటివ్ క్యారెక్టర్.

ఇకపోతే ఈ సినిమాలో నివేత థామస్, అధితిరావ్ హైదరిలు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2020 మార్చి 25న ఉగాది కానుకగా చిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు