తమ్ముడు సినిమాపై నమ్మకంగా ఉన్న అన్నయ్య.!

తమ్ముడు సినిమాపై నమ్మకంగా ఉన్న అన్నయ్య.!

Published on Sep 1, 2014 5:00 PM IST

manchu-vishnu

మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘కరెంట్ తీగ’. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయ్యింది. ఇక మిగిలి ఉన్న 2 పాటలను త్వరలో షూట్ చేయనున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. గతంలో విష్ణుతో ‘దేనికైనా రెడీ’ చేసిన జి. నాగేశ్వర్ రెడ్డి ఈ సినిమాకి డైరెక్టర్.

ఈ సినిమాని మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. మంచు విష్ణు ఈ సినిమా విజయంపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ‘మంచు మనోజ్ చాలా కమిట్ మెంట్ తో కష్టపడి చేసిన సినిమా ఇది. ఈ సినిమాలోని పాత్రని తను మాత్రమే చేయగలడు. అలాగే ఈ సినిమా తన ప్రీవియస్ బాక్స్ ఆఫీసు రికార్డ్స్ ని క్రాస్ చేస్తుందని ఎంతో నమ్మకంగా ఉన్నామని’ విష్ణు అన్నాడు. సెప్టెంబర్ 3న ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేసి అక్టోబర్ లో సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు