ఆ రెండు చిన్న చిత్రాల మధ్య పెద్ద పోటీ.

ఆ రెండు చిన్న చిత్రాల మధ్య పెద్ద పోటీ.

Published on Sep 18, 2019 1:29 PM IST

బాలీవుడ్ లో ఈఏడాది చాలా చిత్రాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన దే దే ప్యార్ దే, భారత్, ఆర్టికల్ 15,కబీర్ సింగ్,సూపర్ 30,మిషన్ మంగళ్, సాహో వంటి చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ కోవలోకి మరో రెండు చిత్రాలు వచ్చి చేరాయి. వాటిలో ఒకటి శ్రద్దా కపూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కాంబినేషన్ లో దంగల్ దర్శకుడు తెరకెక్కించిన ఛిచ్చోరే కాగా హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ మరొక చిత్రం. ఈ రెండు చిత్రాలు పోటీపడి మరీ వసూళ్లు సాధిస్తున్నాయి.

దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన ఛిచ్చోరే ఈనెల 6న విడుదలైన హిట్ టాక్ సొంతం చేసుకుంది. కామెడీ, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం రెండువారాలకు గాను, 102 కోట్ల వసూళ్లు సాధించి బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలించింది. ఈ చిత్రంలో తెలుగు నటుడు నవీన్ పోలిశెట్టి కూడా ఓ కీలకపాత్ర చేయడం విశేషం. ఇక ఆయుష్మాన్ ఖురానా హీరోగా దర్శకుడు రాజ్ శాండియా తెరకెక్కించిన డ్రీమ్ గర్ల్ కూడా భారీ వసూళ్ల వసూళ్ల వైపుగా దూసుకెళుతుంది. ఈ చిత్రం ఐదు రోజులకు గాను దాదాపు 60కోట్ల వసూళ్లు సాధించి క్లియర్ హిట్ అని నిరూపించుకుంది. చిన్న చిత్రాలుగా విడుదలైన ఈ రెండు ఒకదానికి మించి మరొకటి వసూళ్లు సాధిస్తూ సత్తా చాటుతున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు