‘తిక్క’ టీజర్ విడుదల వాయిదా!!

tikka
వరుస విజయాలతో జోరు మీద ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, తన కొత్త సినిమా ‘తిక్క’ను కూడా అప్పుడే విడుదలకు సిద్ధం చేసేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఆగష్టు నెలాఖర్లో విడుదలవుతుందనుకున్న ఈ సినిమా, ‘జనతా గ్యారెజ్’ వాయిదా పడడంతో ఆగష్టు 13వ తేదీకే వచ్చేస్తోంది. ఇక అనుకున్న తేదీకి ముందే వచ్చేస్తూ ఉండడంతో సినిమాకు క్రేజ్ తెచ్చే పనిలో టీమ్ నేడు ఫస్ట్ టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా చివరినిమిషంలో టీజర్ విడుదలను వాయిదా వేసేసింది.

సౌండ్ మిక్సింగ్ పనులు సరిగ్గా పూర్తి కానందువల్ల తాము అనుకున్న ఔట్‌పుట్ రాలేదని, త్వరలోనే కొత్త టీజర్ విడుదల తేదీని మళ్ళీ ప్రకటిస్తామని టీమ్ తరపున సంగీత దర్శకుడు థమన్ స్పష్టం చేశారు. ఇక ఈ టీజర్ కోసం సాయంత్రం నుంచీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానులంతా నిరుత్సాహపడ్డారు. కాగా మంచి ఔట్‌పుట్ అందించాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతానికి టీజర్ విడుదలను వాయిదా వేశామని టీమ్ తెలిపింది. రోహిణ్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో లారిస్సా బొనెస్సి, మన్నారా చోప్రా హీరోయిన్లుగా నటించారు. జూలై 30న ఈ సినిమాకు సంబంధించిన ఆడియో విడుదల కానుంది.

 

Like us on Facebook