సమీక్ష : తిప్పరా మీసం – అక్కడక్కడా ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : తిప్పరా మీసం – అక్కడక్కడా ఆకట్టుకునే ఎమోషనల్ డ్రామా !

Published on Nov 9, 2019 3:03 AM IST
Thipparaa Meesam review

విడుదల తేదీ : నవంబర్ 8, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : శ్రీ విష్ణు, నిక్కీ తంబోలీ, రోహిణి తదితరులు

దర్శకత్వం : కృష్ణ విజయ్ఎల్

నిర్మాత‌లు : రిజ్వాన్

సంగీతం : సురేష్ బొబ్బిలి

సినిమాటోగ్రఫర్ : సిధ్

ఎడిటర్: :ధర్మేంద్ర కాకర్ల


యంగ్ హీరో శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా వచ్చిన చిత్రం తిప్ప‌రా మీసం. కృష్ణ విజ‌య్‌.ఎల్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :
మణిశంకర్ (శ్రీవిష్ణు) చిన్న తనంలోనే డ్రగ్స్ కి ఎడిట్ అయి.. ఆ క్రమంలో చివరికి తన తల్లి(రోహిణి) పైనే ద్వేషం పెంచుకుని ఆమెను శత్రువులా చూస్తుంటాడు. అయితే ఇలాంటి మణిశంకర్ పెరిగి పెద్దయ్యాక ఒక పబ్ లో డీజే గా పని చేస్తూ.. విపరీతంగా బెట్టింగ్స్ చేస్తూ కొన్ని ఆర్ధిక సమస్యల్లో ఇరుక్కుంటాడు. ఈ మధ్యలో మౌనిక (నిక్కీ తంబోలి)తో ప్రేమలో పడతాడు. మరో పక్క తనకు వచ్చిన సమస్యల నుండి బయట పడటానికి డబ్బు కోసం ఇల్లీగల్ గేమ్స్ ఆడుతుంటాడు. వాటి కారణంగా అతని జీవితం ఉహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ మణిశంకర్ జీవితంలో చోటు చేసుకున్న ఆ మలుపు ఏమిటి? చివరికీ తన తల్లి ప్రేమను అతను అర్ధం చేసుకుంటాడా? లేదా? అసలు అతను తల్లిని అంతగా ద్వేషించడానికి కారణం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెర పై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ప్ర‌పంచంలో అన్ని మారినా.. అమ్మ ప్రేమ మాత్రం ఎప్పటికీ మార‌దు. అలాంటి అమ్మ ప్రేమను ఈ సినిమాలో బలంగా చూపించటానికి చేసిన ప్రయత్నం మెచ్చుకోతగినిది. కథ సింపుల్ గా ఉన్న కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో హీరో మారే సన్నివేశాల క్రమం మరియు క్లైమాక్స్ అలాగే మెయిన్ గా హీరో తల్లి దగ్గరకి వచ్చి క్షమాపణ కోరే సీన్ చాల బాగుంది. ఇక శ్రీవిష్ణు మణిశంకర్ పాత్రలో అద్భుతంగా నటించారు. క్లిష్టమైన కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. హీరోయిన్ తో సాగే లవ్ ట్రాక్ బాగానే ఉంది.

ఇక సీనియర్ నటి రోహిణి కూడా అమ్మ‌పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. కొడుకు మీద ప్రేమను వ్యక్త పరిచే ప్రతి సన్నివేశంలో ఆమె నటన ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. హీరోయిన్ గా నటించిన నిక్కీ తంబోలి కొన్ని లవ్ సీన్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అలాగే హీరోకి మామయ్య పాత్రలో కనిపించిన బెనర్జీ మరియు చెల్లిగా నటించిన నటి కూడా బాగా నటించారు. ఇతర పాత్రల్లో కనిపించిన మిగిలిన నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు.

 

మైనస్ పాయింట్స్:

దర్శకుడు కృష్ణ విజ‌య్‌ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మరియు ప్రీ ఇంటర్వెల్ లో గేమ్ యాక్షన్ సీక్వెన్స్ స్ పర్వాలేదనిపించినా.. స్క్రీన్ ప్లే సాగతీసినట్లు చాల స్లోగా సాగుతుంది. దానికి తోడు కొన్ని మెయిన్ సన్నివేశాలు కూడా బోర్ కొడతాయి. పైగా ఫస్టాఫ్ లో ల్యాగ్ సీన్స్ బాగా ఎక్కువయ్యాయి.

ఇక సినిమాలో హీరో చుట్టూ సాగే డ్రామా మరియు బలహీనమైన సంఘర్షణకి లోబడి బలహీనంగా సాగడం కూడా బాగాలేదు. అయితే దర్శకుడు హీరో జర్నీని బలంగా ఎలివేట్ చేసినప్పటికీ.. హీరోకి ఎదురయ్యే సమస్యలను కానీ.. హీరో పాత్రకి అతని తల్లి పాత్రకు మధ్య వచ్చే సంఘర్షణ గానీ ఆ స్థాయిలో లేవు. వారిద్దరి మధ్య సన్నివేశాలను ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

అయితే దర్శకుడు సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. మెయిన్ గా సెకండ్ హాఫ్ స్లోగా సాగుతూ (క్లైమాక్స్ మినహా ) బోర్ కొడుతోంది. సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి చాల ప్లస్ అయ్యేది. అలాగే ఎండింగ్ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు.. సురేశ్ బొబ్బిలి పాటల్లో లవ్ సాంగ్ బాగుంది. అలాగే ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించాల్సింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు సరైన కథాకథనాలను రాసుకోలేకపోయారు.

 

తీర్పు :

శ్రీవిష్ణు – నిక్కీ తంబోలి హీరోహీరోయిన్లుగా మదర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో మరియు కొన్ని యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకున్నా.. కథాకథనాలు స్లోగా సాగుతూ సినిమా ఆసక్తికరంగా సాగలేదు. దర్శకుడు మంచి పాయింట్ తీసుకున్నా.. ఆ పాయింట్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా సినిమాని మలచలేకపోయాడు. అయితే సినిమాలో శ్రీవిష్ణు యాక్టింగ్ అండ్ తల్లి సెంటిమెంట్ ఆకట్టుకుంటాయి. మరి ఇలాంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేది చూడాలి.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు