చైతూకి మూడో భామ దొరికేసింది!!

చైతూకి మూడో భామ దొరికేసింది!!

Published on Nov 25, 2015 8:38 AM IST

naga-chaitanya
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో చేస్తున్న మరో సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తర్వాత నాగ చైతన్య మలయాళ సూపర్ హిట్ ‘ప్రేమమ్’ రీమేక్ లో నటించనున్న విషయం అందరికీ తెలిసిందే.. ఈ సినిమాని నవంబర్ 30వ తేదీన లాంచ్ చేసి, డిసెంబర్ మొదటి నుంచి సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. కార్తికేయ ఫేం చందూ మొండేటి ఈ రీమేక్ కి దర్శకత్వం వహించనున్నాడు.

మొత్తం ముగ్గురు హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో ఇప్పటికే అందాల భామలు శృతి హాసన్, అనుపమ పరమేశ్వరన్ ని సెలక్ట్ చేసారు. గత కొద్ది రోజులుగా మూడవ హీరోయిన్ కోసం సెలక్ట్ చేస్తున్నారు. మొదట్లో మూడవ హీరోయిన్ గా ఓ స్టార్ హీరోయిన్ ని అనుకున్నప్పటికీ ఫైనల్ గా ఓ కొత్త హీరోయిన్ ని ఎంపిక చేసారు. తనే ఐషా శర్మ. ‘చిరుత’ ఫేం నేహ శర్మకి సిస్టర్ అయిన ఐషా శర్మని ‘మజ్ను’లో మూడవ హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. ఇది కాకుండా ఐషా శర్మ సుమంత్ అశ్విన్ ‘రైట్ రైట్’కి కూడా సైన్ చేసింది. మరోవైపు పూరి జగన్నాధ్ ‘రోగ్’ కోసం కూడా ఈ భామని పరిశీలిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు