విడుదలకానున్న ‘నిన్ను కోరి’ మూడవ పాట !

విడుదలకానున్న ‘నిన్ను కోరి’ మూడవ పాట !

Published on Jun 22, 2017 4:23 PM IST


యంగ్ హీరో నాని చేస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘నిన్ను కోరి’ చిత్రం పట్ల తెలుగు ప్రేలక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ప్రతి సినిమాలో అద్భుతమైన నటనతో పాటు వైవిధ్యం కూడా కనబర్చే నాని ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం చూపిస్తాడో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మధ్యే విడుదలైన సినిమాలోని రెండు పాటలు కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకున్నాయి.

దీంతో ఈ క్రేజ్ ను ఇలాగే కొనసాగించాలని నిర్ణయించిన టీమ్ మూడవ పాట ‘ఒన్స్ అపాన్ ఏ టైములో’ ను ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనుంది. వరుసగా రెండు పాటలతో ఉర్రూతలూపిన టీమ్ మూడవ పాటను ఏ స్థాయిలో రూపొందించిందో చూడాలి. ‘జెంటిల్మెన్’ ఫేమ్ నివేతా థామస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ట్రైయాంగిల్ లవ్ స్టోరీలో ఆది పినిశెట్టి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. నూతన దర్శకుడు శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు