ఆ చిత్రం నిజంగా మరో ‘బాహుబలి’ అవుతుందా ?

ఆ చిత్రం నిజంగా మరో ‘బాహుబలి’ అవుతుందా ?

Published on Jul 20, 2017 7:10 PM IST


ఇప్పటి వరకు తెలుగు పరిశ్రమలోనే గాక భారతీయ చిత్ర రంగంలోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రాజమౌళి రూపొందించిన అద్భుతం ‘బాహుబలి-2’ నిలిచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సాధించిన విజయం ముందు ఆ తర్వాత విడుదలై బాలీవుడ్ సినిమాలు ఏవీ కూడా నిలవలేకపోయాయి. కనీసం బాహుబలి హిందీ వెర్షన్ సెట్ చేసిన టార్గెట్ ను కూడా రీచ్ కాలేకపోయాయి. దీంతో అక్కడి పెద్ద నిర్మాతలు, హీరోలు, దర్శకుల్లో బాహుబలిని మించిన సినిమా తీయాలనే తపన మొదలైంది.

ఇప్పుడు ఆ తపనే ప్రయత్న రూపం దాల్చి ‘తానాజీ’ గా రూపుదిద్దుకుంటోందనే టాక్ బీ టౌన్ లో వినబడుతోంది. ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్నారట. దీనికి సంబందించిన ఫస్ట్ లుక్ కూడా విడుదలై ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా చర్చే. అందరూ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా బాహుబలి స్థాయిలో ఉంటుందని అనుకుంటున్నారు. మరి ఈ మాటలు ఎంతవరకు నిజమవుతాయో, మరో బాహుబలి ఎలా అంటుందో కాలమే నిర్ణయించాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు