సుక్కు – బన్నీల పుష్ప లేటెస్ట్ ప్లాన్ ఇదే.

సుక్కు – బన్నీల పుష్ప లేటెస్ట్ ప్లాన్ ఇదే.

Published on Jun 6, 2020 8:33 AM IST

లాక్ డౌన్ సినిమా పరిశ్రమపై ఎంతటి ప్రభావం చూపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ బంద్ కారణంగా చిత్రాల విడుదల ఆగిపోయింది. కొత్త చిత్ర షూటింగ్స్ కూడా నిలిచిపోయాయి. కాగా ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం పరిమితుల మధ్య షూటింగ్స్ కి అనుమతి ఇవ్వడం జరిగింది. ఐతే అవుట్ డోర్ షూటింగ్ చేసే పరిస్థితి లేదు. దీనితో దాదాపు ఇండోర్ షూటింగ్స్ కే దర్శక నిర్మాతలు ప్రణాళికలు వేస్తున్నారు.

ఇక బన్నీ సుకుమార్ ల ఫస్ట్ పాన్ ఇండియా మూవీ పుష్ప షెడ్యూల్ ప్రకారం కేరళలో చిత్రీకరించాల్సి వుంది. ప్రస్తుత పరిస్థితులలో అది జరగని పని. దీనితో సుకుమార్ ముందు సెట్స్ తో చిత్రీకరించగలిన సన్నివేశాలు పూర్తి చేయాలని చూస్తున్నారట. సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత అవుట్ డోర్ షూటింగ్ పెట్టుకోవాలన్నది వాళ్ళ ప్లాన్ అట. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుంది. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు