అలా మొదలైన జర్నీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

అలా మొదలైన జర్నీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

Published on Aug 9, 2020 5:41 PM IST

మాటల మాంత్రికుడిగా పేరున్న దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేయాలని ఏ హీరోకైనా ఉంటుంది. ఓ సారి చూస్తే మళ్ళీ మళ్లీ చూడాలి అనేంతగా త్రివిక్రమ్ సినిమాలు ఉంటాయి. త్రివికమ్ కెరీర్ లో ఇప్పటి చేసింది కేవలం 11 సినిమాలు. అందులో ఆరు సినిమాలు కేవలం పవన్ మరియు అల్లు అర్జున్ తో చేశారు. పవన్ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో మరో మూడు సినిమాలు చేశారు. ఆ తరువాత రెండు సినిమాలు చేసిన హీరోగా మహేష్ ఉన్నాడు.

కాగా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ మొదటి మూవీగా జులాయి చేశాడు. 2012లో వచ్చిన ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మరలా ఇదే కాంబినేషన్ లో 2015లో సన్ ఆఫ్ సత్యమూర్తి అనే ఫ్యామిలీ ఎంటెర్టైనర్ రావడం జరిగింది. ఆ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక వీరిద్దరి హ్యాట్రిక్ మూవీగా వచ్చిన అలా వైకుంఠపురంలో ఈ సంక్రాంతికి విడుదలై ఇండస్ట్రీ హిట్ కొట్టింది. జులాయి మూవీతో హిట్ కాంబినేషన్ గా మొదలైన వీరి జర్నీ అల వైకుంఠపురంలో మూవీతో ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి వెళ్ళింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు