కరోనా ప్రభావం చిన్న నిర్మాతల లక్ష్యాన్ని చంపేస్తుందా!

కరోనా ప్రభావం చిన్న నిర్మాతల లక్ష్యాన్ని చంపేస్తుందా!

Published on Sep 22, 2020 4:15 PM IST

ఈ సంవత్సరం ఇలా ఉంటుంది అని అసలు ఎవరు ఎప్పుడు కలలో కూడా ఊహించి ఉండరు. చైనాలో పుట్టిన కరోనా వైరస్ మూలాన ఎలాంటి సంక్షోభం నెలకొందో అందరికీ తెలిసిందే. అయితే దీని వలన విధించిన లాక్ డౌన్ వల్ల చాలా పరిశ్రమలే మూత పడే వరకు వచ్చేసాయి.

అయితే దీని వలన దారుణంగా నష్టపోయింది మాత్రం ముమ్మాటికీ సినీ పరిశ్రమే అని చెప్పాలి. సినిమానే నమ్ముకున్న చాలా మంది జీవితాలు ఛిద్రం అయ్యిపోయాయి. థియేటర్స్ నమ్ముకున్నవారు నిర్మాతలు సినిమా పని తప్ప మరో పని తెలియని వారు చాలానే నష్టపోయారు.

అయితే ఎన్ని సినిమాలు తీయాలన్నా ఎలాంటి సినిమా తీయాలన్నా సరే ఒక నిర్మాత అనే వ్యక్తి లేకుండా సాధ్యం కాదు. అయితే పెద్ద నిర్మాతల పరిస్థితి ఓకే కానీ చిన్నగా సినిమాలు మొదలు పెట్టి పెద్ద స్థానానికి చేరుకోవాలి అనుకునే పెద్ద కలలు ఉన్న చిన్న స్థాయి నిర్మాతల ఆశలకు గండి పడినట్టే అని చెప్పాలి.

ఇప్పుడు ఎంత ఓటిటి విడుదలలు వచ్చినా వాటి ప్రభావం థియేటర్స్ దగ్గర ఎందుకూ పనికి రాదు. కానీ థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అర్ధం కాని పరిస్థితి. పైగా ఇపుడు షూటింగ్స్ మొదలైనప్పటికీ థియేటర్స్ చేసినంత ప్రభావం ఓటిటి చేయలేదు.

దీనితో ఈ కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ చిన్న నిర్మాతలు తీసే సినిమాలు ఓటిటి లో విడుదలైనా తమ చిత్రాలను ఎక్కువ సంఖ్యలో థియేట్రికల్ విడుదల చెయ్యాలనే లక్ష్యాన్ని చంపేస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు