అనుష్క “నిశ్శబ్దం”కు ప్రేరణ ఆ లెజెండరీ సినిమా.!

అనుష్క “నిశ్శబ్దం”కు ప్రేరణ ఆ లెజెండరీ సినిమా.!

Published on Sep 27, 2020 8:41 PM IST

మన దక్షిణాదిలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి. ఒక పక్క పలు చిత్రాల్లో హీరోయిన్ గా మాత్రమే కాకుండా తానే మెయిన్ లీడ్ లో కూడా నటిస్తూ వస్తున్నారు. అలా తాను లేటెస్ట్ గా నటించిన చిత్రం “నిశ్శబ్దం”.ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ ఊహించ్చని విధంగా లాక్ డౌన్ అడ్డు రావడంతో థియేట్రికల్ రిలీజ్ కాస్తా డైరెక్ట్ గా ఓటిటి విడుదలకు రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ అండ్ ట్రైలర్ లను చూస్తే ఒక క్రైమ్ అండ్ హర్రర్ థ్రిల్లర్ లా కనిపిస్తుంది అని చెప్పాలి.

కానీ ఈ చిత్రానికి మాత్రం దర్శకుడు హేమంత్ మధుకర్ కు ప్రేరణ ఒక లెజెండరీ దర్శకుడు తెరకెక్కించిన అద్భుతమైన ప్రయోగమట. అదే దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు విశ్వనటుడు కమల్ హాసన్ తో చేసిన అద్భుత చిత్రం “పుష్పక విమానం” ఈ చిత్రాన్నే ప్రేరణగా తీసుకొని “నిశ్శబ్దం” స్క్రిప్ట్ రాసుకున్నారట. కానీ పూర్తిగా విభిన్నంగా..ఇక ఇప్పటికే మంచి హైప్ ను తెచ్చుకున్న ఈ చిత్రం వచ్చే అక్టోబర్ నెల 2న డిజిటల్ ప్రీమియర్ గా అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు