ఇంటర్వ్యూ : తాతినేని సత్య – ఈ సినిమాతో సచిన్ జోషికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది !

ఇంటర్వ్యూ : తాతినేని సత్య – ఈ సినిమాతో సచిన్ జోషికి ప్రత్యేక గుర్తింపు వస్తుంది !

Published on Sep 14, 2017 7:05 PM IST


‘భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్’ వంటి సినిమాలతో మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తాతినేని సత్య చేసినతాజా చిత్రం ‘వీడెవడు’. సచిన్ జోషి హీరోగా నటించిన ఈ సినిమా రేపు రిలీజ్ కానుంది. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…

ప్ర) మీ ‘వీడెవడు’ ఎలా ఉండబోతోందో చెప్పండి ?
జ) ఇదొక థ్రిల్లర్. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే స్పోర్ట్స్ కూడా కలిసి ఉంటుంది. అంటే స్పోర్ట్స్ కలిసిన క్రైమ్ స్టోరీ అన్నమాట.

ప్ర) అసలుకథ ఏంటి ?
జ) హీరో భార్య హత్యకు గురవుతుంది. ఆ హాత్యా నేరం హీరో మీద పడుతుంది. అసలు ఆ హత్య హీరో చేశాడా లేకపోతే ఇంకెవరైనా చేశారా అనేదే సినిమా.

ప్ర) హీరో పాత్ర ఎలా ఉంటుంది ?
జ) ఇందులో హీరో ప్రో కబడ్డీ ప్లేయర్. అతను ఆటతో క్రైమ్ ను మిక్స్ చేసి ఆడుతుంటాడు. మిగతా క్యారెక్టర్ ఏమిటనేది స్క్రీన్ మీద చూడాల్సిందే.

ప్ర) ఈ కథ ఎలా పుట్టింది ?
జ) నా దగ్గర పూర్తి కథ లేదు. కేవలం థ్రిల్లర్ కు లైన్ మాత్రమే ఉంది. ఈ సినిమా యొక్క ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూజర్ ద్వారా సచిన్ జోషిని కలిసినప్పుడు అతనే చెప్పాడు థ్రిల్లర్ కి క్రైమ్ ను మిక్స్ చేసి కథ రాయండి అని. అలా ఈ కథ పుట్టింది.

ప్ర) బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తాను ఎందుకు తీసుకున్నారు ?
జ) ఈ సినిమా ముందు ఈషా నాకు అస్సలు తెలీదు. ఆమెను ఆంతకుముందు చూడలేదు కూడా. సచిన్ నాతో ఒకసారి ఆమెను కలిసి కథ చెప్పండి, నచ్చితే తీసుకోండి అన్నారు. ఆమెను కలిసి కథ చెప్పగానే ఒప్పుకుంది.

ప్ర) సినిమా ఎందుకింత ఆలస్యమైంది ?
జ) సినిమా బౌండ్ స్క్రిప్ట్ తయారుచేయడానికి ఎక్కువ టైం పట్టింది. ఆ తర్వాత తమిళంలో కూడా చేస్తే బాగుంటుందని నటులను మార్చి అందులో కూడా చేసేప్పటికి లేట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం 8 నెలలు పట్టింది.

ప్ర) ‘భీమిలీ కబడ్డీ జట్టు’ తర్వాత పెద్ద హీరోలతో ఎందుకు చేయలేదు ?
జ) ‘భీమిలీ కబడ్డీ జట్టు’ హిట్ తర్వాత కూడా పెద్ద సినిమాలు చేయలేకపోవడానికి కారణం సరైనా పిఆర్ లేకపోవడమే. నేను పెద్దగా హీరోల్ని, నిర్మాతల్ని కలవను. అందుకే అవకాశాలు ఎక్కువగా రాలేదు.

ప్ర) ఈ సినిమా కథ మీరే రాసుకున్నారా ?
జ) అవును. నా ఇంతకు ముందు సినిమాలన్నీ రీమేక్ సినిమాలే. ఇది నా మొదటి సొంత కథ.

ప్ర) ఈ సినిమా రిజల్ట్ మీకు, సచిన్ కి ఎలా కలిసొస్తుంది ?
జ) ఈ సినిమాతో నేను రీమేక్ సినిమాలు మాత్రమే చేయగలననే పేరు పోతుంది. ఇండివిడ్యువల్ కథ కూడాను కూడా చేయగలను అనే గుర్తింపొస్తుంది. ఇక సచిన్ జోషికి ఇదొక ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది.

ప్ర) తర్వాత ఎవరితో చేయాలనుకుంటున్నారు ?
జ) పలానా వాళ్లతోనే చేయాలని ఖచ్చితంగా అనుకోలేదు. కానీ నానీకి ఒక లైన్ చెప్పాను. అతనితోనే చేయొచ్చు. ఆ సినిమా పొలిటికల్ డ్రామాగా ఉంటుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు