విజయ్ సినిమాకు ఈ స్టార్ హీరో పాటలు రాస్తాడట.!

విజయ్ సినిమాకు ఈ స్టార్ హీరో పాటలు రాస్తాడట.!

Published on Mar 2, 2021 9:00 AM IST

కోలీవుడ్ స్టార్ హీరో థలపతి విజయ్ ఇప్పుడిప్పుడే మన తెలుగు లో కూడా మంచి మార్కెట్ ను తెచ్చుకొంటున్నాడు. లేటెస్ట్ “మాస్టర్”తో అది ఇంకా ఎక్కువ కావడంతో అతను చేసే నెక్స్ట్ సినిమాలు కూడా ఖచ్చితంగా మార్కెట్ చేస్తాయని చెప్పాలి. అయితే ఇప్పుడు విజయ్ తన 65వ సినిమా చెయ్యడానికి సంసిద్ధం అవుతున్న నేపథ్యంలో దీనిపై కొన్ని ఆసక్తికర విషయాలే బయటకు వస్తున్నాయి.

ఇది ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లా తెరకెక్కుతుంది అన్న టాక్ మాత్రమే కాకుండా ఇప్పుడు మరో ఆసక్తికర టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా కోసం అక్కడి మరో యంగ్ అండ్ టాలెంటెడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ పాటల రచయితగా మారుతున్నాడట. ఈ విషయాన్ని కోలీవుడ్ వర్గాలు గట్టిగానే చెబుతున్నాయి. మరి ఓ స్టార్ హీరో సినిమాకు ఇంకో స్టార్ హీరో సాహిత్యం అందివ్వడం కాస్త విశేషమే అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం ఇస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు