ఈసారి ప్రపంచానికే సందేశం ఇవ్వనున్న రజనీ !

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలంటే వాటిలో ప్రస్తుత సమాజానికి ఉపయోగపడే సందేశం ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. ఇక దర్శకుడు శంకర్ అయితే సొసైటీకి, జనాలకి మంచి మెసేజ్ ఇవ్వడం కొసమే సినిమాలు తీస్తుంటారు. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చే చిత్రమంటే అందులో సందేశం తప్పక ఉండి తీరుతుంది.

ప్రస్తుతం వీరు కలిసి చేస్తున్న ‘రోబో-2’ లో అలాంటి మెసేజే ఉంటుందట. అది కూడా యావత్ ప్రపంచానికి సంబందించినదై ఉంటుందట. మరి ఆ ప్రపంచ సందేశం ఏమిటో తెలియాలంటే వచ్చే ఏడాది జనవరి వరకు ఆగాల్సిందే. ప్రస్తుతం చివరి పాట షూట్లో ఉన్న ఈ సినిమా ఆడియో ఈ నెల 27న దుబాయ్ లో జరగనుంది.

 

Like us on Facebook