మహేష్ సాంగ్ తో ‘మైండ్ బ్లాక్’ చేసిన వార్నర్

మహేష్ సాంగ్ తో ‘మైండ్ బ్లాక్’ చేసిన వార్నర్

Published on May 30, 2020 12:47 PM IST

చెప్పినట్లుగానే వార్నర్ ఓ సర్ప్రైజింగ్ వీడియోతో వచ్చేశాడు. నిన్న తన నుండి వరుస వీడియోలు ఉంటాయని చెప్పిన వార్నర్ తన భార్య కాండీస్ వార్నర్ తో కలిసి సరిలేరు నీకెవ్వరు మూవీలోని మాస్ బీట్ సాంగ్ ‘మైండ్ బ్లాక్’ కి అదిరిపోయే స్టెప్స్ తో ఇరగదీశాడు. ఈ సాంగ్ లో మహేష్ డాన్స్ ని ఇమిటేట్ చేయడానికి వార్నర్ చాలా కష్టపడ్డాడట. దదాపు 50సార్లు ప్రయత్నిస్తే కానీ ఆ మాత్రం పర్ఫెక్షన్ రాలేదట. ఈ విషయాన్ని వీడియోతో పాటు వార్నర్ పంచుకున్నారు.

ఇది జస్ట్ పార్ట్ వన్ అని చెవుతున్న వార్నర్ రేపు మరో ఆసక్తికర వీడియోతో వచ్చే అవకాశం కలదు. రేపు కూడా ఆయన మహేష్ కి సంబంధించిన సాంగ్ లేదా డైలాగ్ వీడియో చేయనున్నారు. తమ హీరో పాటకు ఇంటర్నేషనల్ క్రికెటర్ డాన్స్ చేయడం మహేష్ ఫ్యాన్స్ కి పిచ్చ కిక్ ఇస్తుంది. ఆయన వారికి సూపర్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్నారు .

https://www.instagram.com/p/CAzSUulpnpk/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు