పవన్ సాలిడ్ చిత్రంలో ఈ వెర్సిటైల్ నటుడు కూడానా.?

పవన్ సాలిడ్ చిత్రంలో ఈ వెర్సిటైల్ నటుడు కూడానా.?

Published on Jan 16, 2021 8:00 AM IST

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టేకప్ చేసిన పలు ఆసక్తికర ప్రాజెక్టులలో మోస్ట్ వాంటెడ్ చిత్రం అయ్యప్పణం కోషియం రీమేక్ కూడా ఒకటి. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రానికి గాను పవన్ కు ఆపోజిట్ గా టాలీవుడ్ హల్క్ రాణా నటిస్తున్నాడు. మరి తొందరలోనే స్టార్ట్ కానున్న ఈ చిత్రం కోసం మేకర్స్ సరవేగంగానే అప్డేట్స్ ను వదులుతున్నారు.

మరి ఇదిలా ఉండగా ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ కు గాను ఓ టాలెంటెడ్ అండ్ వెర్సిటైల్ నటుడు కూడా కనిపించనున్నాడని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అతడే సముథ్రఖని. లేటెస్ట్ గా మాస్ మహారాజ్ “క్రాక్”లో కఠారి కృష్ణగా కనిపించి అదరగొట్టిన ఈ నటుడు కూడా పవన్ సినిమాలో ఉన్నాడని టాక్ మొదలయ్యింది.

మరి ఇందులో ఎంతవరకు నిజముందో కానీ దానిపై అధికారిక క్లారిటీ వచ్చే వరకు ఆగాల్సిందే. ఇక ఈ సాలిడ్ ప్రాజెక్ట్ కు గాను లేటెస్ట్ గా త్రివిక్రమ్ యాడ్ అవ్వగా థమన్ సంగీతం అందిస్తున్నారు. మరి అలాగే సాగర్ కె చంద్ర దర్సకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు