మహేష్ 25వ సినిమా కోసం 3 పాటలు సిద్ధమయ్యాయి !
Published on Nov 2, 2017 9:56 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న ‘భరత్ అనే నేను’ చిత్రీకరణ పూర్తవగానే తన 25వ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనుల్ని పూర్తి చేసిన వంశీ పైడిపల్లి న్యూయార్క్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. ఈ సిట్టింగ్స్ లో చిత్ర సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు.

ఈ సిట్టింగ్స్ లో ఇప్పటికే మూడు పాటల్ని ఫైనల్ చేశారట దేవిశ్రీ ప్రసాద్. ఈ మూడు పాటలు కూడా వేటికవే భిన్నంగా, కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూట్ కు వెళ్లనుంది. అశ్వినీ దత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు.

 
Like us on Facebook