మళయాలంలో ‘S/O సత్యమూర్తి’ అదుర్స్..!

మళయాలంలో ‘S/O సత్యమూర్తి’ అదుర్స్..!

Published on Apr 25, 2015 9:08 AM IST

Son-of-satyamurty
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన తాజా సినిమా ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 9న విడుదలైన ఈ సినిమా విడుదలై రెండు వారాలైనా మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా విజయంతో అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల ఖాతాలో మరో హిట్ పడిపోయింది. అల్లు అర్జున్ ఇంటెన్స్ నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. త్రివిక్రమ్ మ్యాజిక్ డైలాగులు, మేకింగ్ ఈ సినిమాకు బలంగా నిలిచాయి. హీరోయిన్లు సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు సినిమా విజయంలో కీలక పాత్ర వహించారు.

ఇక తెలుగులో ఇంత మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా నేడు (ఏప్రిల్ 24న) మళయాలంలో భారీ ఎత్తున విడుదల అయింది. అల్లు అర్జున్ సినిమాలకు మళయాలంలో ఎంత క్రేజ్ ఉంటుందన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఏ హీరోకూ లేనంత మార్కెట్ బన్నీకి మళయాల పరిశ్రమలో ఉంది. ఇక ఆ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందనేది ఈ రోజు మరోసారి ప్రూవ్ అయింది.’S/O సత్యమూర్తి’ మళయాల వర్షన్ విడుదలైన ప్రతిచోట హౌస్‌ఫుల్ బోర్డులతో దూసుకెళుతోంది. అల్లు అర్జున్ స్వయంగా కేరళ వెళ్ళి ఈ సినిమా కోసం ప్రమోట్ చేయడం మరింత కలిసివచ్చిందని ట్రేడ్ టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు