రెండోవారం కూడా స్టడీగా ‘టైగర్’..!

రెండోవారం కూడా స్టడీగా ‘టైగర్’..!

Published on Jul 4, 2015 11:24 AM IST

tiger

సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు మురుగదాస్ శిష్యుడు వీఐ ఆనంద్ తెరకెక్కించిన సినిమా ‘టైగర్’. మంచి అంచనాల మధ్య గత జూన్ 26న విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోవడమే కాక బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ఓపెనింగ్స్‌ను సాధించి పెట్టింది. ఇక మొదటివారం మంచి కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ సినిమా రెండో వారం కూడా స్టడీగా కొనసాగుతూ ఉండడం విశేషం.

‘టైగర్’ సినిమా విడుదలైనప్పట్నుంచే హిట్ టాక్ సొంతం చేసుకోవడం, ఎక్కువ థియేటర్లలో విడుదల కావడం, పెద్ద సినిమాలేవీ విడుదలకు దగ్గరగా లేకపోవడం వంటి కారణాలతో మొదటి వారం మంచి ఓపెనింగ్స్‌నే కొల్లగొట్టింది. ఇక టైగర్ టీమ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన సక్సెస్ టూర్ సినిమాను రెండో వారం కూడా స్టడీగా కొనసాగేలా దోగదపడనుందని చెప్పొచ్చు. నిన్న విడుదలైన సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో బాహుబలి వచ్చే వరకూ టైగర్‍కు మంచి అడ్వాంటేజ్ ఉంది.

ఇక ఈ సినిమాలో సందీప్ కిషన్ ఎనర్జిటిక్ యాక్టింగ్, రాహుల్ రవీంద్రన్ స్ట్రాంగ్ సపోర్ట్, కట్టిపడేసే వీఐ ఆనంద్ సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్, చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ మేజర్ హైలైట్స్‌గా నిలిచాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు