లేడీ సూపర్ స్టార్ అనుష్క నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘భాగమతి’ షూటింగ్ పనుల్ని పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ ప్రాజెక్ట్ మధ్యలో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనా కూడా ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది. ‘బాహుబలి’ తర్వాత అనుష్క నుండి వత్సున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి క్రేజ్ నెలకొంది ఉంది.
అనుష్క ఐఏఎస్ అధికారిగా కనిపించనుందని చెప్పబడుతున్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ ఈ రోజు మధ్యాహ్నం 1 గంట 35 నిముషాలకు రిలీజ్ కానుంది. ఇది వరకే విడుదలైన టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ట్రైలర్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘పిల్ జమిందార్’ ఫేమ్ అశోక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ లు కూడా పలు కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రాన్ని 2018 జనవరి 26న రిలీజ్ చేయనున్నారు. —
- సూపర్ కాంబో సెట్ చేసుకున్న మైత్రి మూవీమేకర్స్!
- 100కోట్ల గ్రాస్ అందుకున్న మహేష్!
- మాస్ రాజా – నేల టిక్కెట్టు ఫన్ టీజర్ వచ్చేసింది!
- మహేష్ – నమ్రత.. ముద్దు ప్రేమ చూశారా?
- మహేష్ మరోసారి అదరగొట్టేశాడు!
సంబంధిత సమాచారం :
