మహేష్ సినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ !

మహేష్ సినిమా ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్ !

Published on Jan 23, 2018 7:00 PM IST

శ్రీమంతుడు లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత కొరటాల శివ , మహేష్ బాబు కలిసి తాజాగా చేస్తున్న చిత్రం “భరత్ అను నేను”. రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించబోతున్నాడు. కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎనభై శాతం పూర్తి అయ్యింది.

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26 న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కాబోతోందని చిత్ర యూనిట్ గతంలో ప్రకటించారు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్ లో 26వ తేది ఉదయం 7 గంటలకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారని వెల్లడించారు. అభిమమనులు ఎంతగానో ఎదురు చూస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు