ఈ అర్ధరాత్రి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తో ‘వెంకీ 74’ !

ఈ అర్ధరాత్రి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ తో ‘వెంకీ 74’ !

Published on Jan 21, 2020 6:00 PM IST

తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘అసురన్’ను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా ఆయన సోదరుడు, ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ తెలిసింది. జనవరి 22న అర్ధరాత్రి 12 గంటలకు ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అనంతపురంలో జరుగుతోంది. నెల రోజుల పాటు అక్కడే షూటింగ్.

కాగా ఈ చిత్రానికి ‘నారప్ప’అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్నాయి. అయితే సురేష్ ప్రొడక్షన్స్ ఇదే టైటిల్ క్కన్ఫర్మ్ చేస్తారా లేకపోతే వేరే ఏదైనా కొత్త టైటిల్ పెడతారేమో చూడాలి. ఇక నటీనటుల విషయానికొస్తే ఇందులో ప్రియమణి కథానాయికగా నటించనుంది. చిత్రాన్ని 2020 మొదటి సగంలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు సురేష్ బాబు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు