వెంకటేష్ సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకున్న క్రిష్ !

వెంకటేష్ సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకున్న క్రిష్ !

Published on Jan 18, 2017 3:17 PM IST

krish-int
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ని అద్భుతంగా తెరకెక్కించి తెలుగు సినీ ప్రేక్షకుల అభినందనలను అందుకుంటున్న దర్శకుడు క్రిష్ వెంకటేష్ తో చేయబోయే తన తరువాతి సినిమా కోసం సర్వం సిద్ధం చేసుకున్నాడు. సినీ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి కావాల్సిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ రెడీ అయిందని తెలుస్తోంది. అలాగే టైటిల్ ను కూడా రెడీ చేసుకున్న క్రిష్ ఇక వెంకటేష్ దాన్ని ఫైనల్ చేస్తే అధికారికంగా అనౌన్స్ చేస్తాడట.

ఈ సినిమాలకి సంబందించిన ఫస్ట్ లుక్ రఫ్ కాపీ కూడా సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం క్రిష్ పాల్గొంటున్న ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రమోషన్లు ముగిశాక, వెంకటేష్ ‘గురు’ చిత్రానికి సంబందించిన పనుల నుండి ఫ్రీ అయ్యాక టైటిల్, ఫస్ట్ లుక్ బయటికి వదులుతారట. ఇకపోతే వెంకీ చిత్రం తరువాత క్రిష్ బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో చేయబోయే సినిమాకి సైతం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడని వినికిడి. మొత్తానికి క్రిష్ తన ఫ్యూచర్ సినిమాల కోసం పగడ్బందీగానే సిద్దమయ్యాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు