అల్లరి నరేష్, సునీల్ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు !

అల్లరి నరేష్, సునీల్ సినిమాకు టైటిల్ ఖరారు కాలేదు !

Published on Mar 20, 2018 11:59 AM IST

అల్లరి నరేష్, సునీల్ ప్రధాన పాత్రల్లో భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. కాని తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు టైటిల్ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. త్వరలో మంచి టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించబోతున్నారట చిత్ర యూనిట్.

శ్రీ వసంత్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో చిత్ర శుక్ల హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులోని ప్రముఖహ్ హాస్య నటులందరూ ఈ సినిమాలో నటిస్తుండడం విశేషం. ‘సుడిగాడు’ సినిమా తరువాత అల్లరి నరేష్ భీమినేని శ్రీనివాస్ ల కలయికలో వస్తున్న కారణంగా ఈ సినిమాపై మంచి హోప్స్ ఉన్నాయి. 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు