ఇంకొద్దిసేపట్లో రివీల్ కానున్న కళ్యాణ్ దేవ్ సినిమా టైటిల్ !

ఇంకొద్దిసేపట్లో రివీల్ కానున్న కళ్యాణ్ దేవ్ సినిమా టైటిల్ !

Published on May 23, 2018 8:58 AM IST

మెగాస్టార్ చిరంజీవి అల్లుడి హోదాలో త్వరలో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు కళ్యాణ్ దేవ్. నూతన దర్శకుడు రాకేష్ శశి ఈయన్ను డైరెక్ట్ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితమే మొదలైన వీరి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కళ్యాణ్ తన పాత్ర తాలూకు డబ్బింగ్ కూడ మొదలుపెట్టేశారు.

ఇకపోతే ఈ చిత్రం యొక్క టైటిల్ ను ఈరోజు 9 గంటల 37 నిముషాలకు అనౌన్స్ చేయనున్నారు. దీంతో మెగాస్టార్ అల్లుడి మొదటి సినిమా టైటిల్ ఎలా ఉంటుందో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం నిర్మిస్తున్న ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయకిగా నటిస్తుండగా తనికెళ్ళ భరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్ వంటి నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు