అర్థరాత్రి 12 గంటలకి తన హీరోని పరిచయం చేయనున్న పూరి !

అర్థరాత్రి 12 గంటలకి తన హీరోని పరిచయం చేయనున్న పూరి !

Published on Feb 21, 2017 6:38 PM IST


స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం నటుడు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘రోగ్’ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. కన్నడ, తెలుగు భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం పై కన్నడ పరిశ్రమలో భారీ అంచనాలున్నాయి. చాలా ఏళ్ల తర్వాత పూరి కన్నడలో డైరెక్ట్ సినిమా చేస్తుండటం, ఈ సినిమాని సల్మాన్ ఖాన్ సైతం రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉండటంతో కన్నడ ప్రేక్షకుల్లో ఈ చిత్రం పట్ల ఆసక్తి బాగా పెరిగింది. అలాగే తెలుగులో కూడా ఈ సినిమా మరో ‘ఇడియట్’ అవుతుందనే టాక్ నడుస్తోంది.

ఈ మధ్యే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్లో సైతం మరో చంటిగాడి ప్రేమ కథ అనే ట్యాగ్ లైన్ ఉండటంతో పూరి తన పాత మ్యాజిక్ ను ఈ సినిమాతో రిపీట్ చేస్తారని తెలుగు ఆడియన్స్ అందరూ ఆశిస్తున్నారు. ఇకపోతే పూరి తాజాగా తన హీరో ఇషాన్ ను ఈరోజు అర్థరాత్రి 12 గంటలకు ‘రోగ్’ టీజర్ ను విడుదల చేసి అందరికీ పరిచయం చేస్తానని ప్రకటించాడు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లే అంత భిన్నంగా డిజైన్ చేసిన పూరి టీజర్ ను ఏ స్థాయిలో తయారు చేసి ఉంటాడో చూడాలనే క్యూరియాసిటీ అందరిలోనూ మొదలైంది. ఇషాన్ సోదరుడు, ప్రముఖ నిtర్మాత సిఆర్ రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు