నేడు సెన్సార్ జరుపుకోనున్న సూర్య ‘సికిందర్’

నేడు సెన్సార్ జరుపుకోనున్న సూర్య ‘సికిందర్’

Published on Jul 30, 2014 12:52 PM IST

Anjaan

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘అంజాన్’. ఈ సినిమా ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్యకి తెలుగలో కూడా మంచి మార్కెట్ ఉండడం వలన ఈ సినిమాని తెలుగులో ‘సికంధర్’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఒకే రోజున తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ రోజు తెలుగు వెర్షన్ సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది.

లగడపాటి శ్రీధర్ ఈ సినిమాని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. తమిళంలో ఇప్పటికే ఆడియో రిలీజ్ అయ్యింది. తెలుగులో జూలై 31న ఆడియో విడుదల కార్యక్రమం జరగనుంది. శిల్పకళావేదికలో ఘనంగా జరగనున్న ఈ వేడుకకి కమల్ హాసన్, నాగార్జున, అల్లు అర్జున్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి లింగుస్వామి డైరెక్టర్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేసాడు. సూర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు