‘సంక్రాంతి’ సంబరాలలో టాలీవుడ్
Published on Jan 11, 2015 3:50 am IST

Gopala_Gopala-i

‘గోపాల గోపాల’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడానికి పలు అడ్డంకులు ఎదురైనా, విడుదల తేదిపై విడుదలకు ఒక్కరోజు ముందువరకూ ఎటువంటి ప్రకటనా లేకపోయినా ఒక్క పవన్ క్రేజ్ తో థియేటర్ ల దగ్గర మోత మోగిపోతుంది. సినీ ప్రియులకు సరైన సంక్రాంతి కానుకగా ఈ చిత్రం అందించిన సురేష్ ప్రొడక్షన్స్ ని అభినందిస్తున్నారు. దీనికి మరో ఆనందం జతకలిస్తే ఇంకా నిజంగా పండగే. శంకర్ విక్రమ్ ల ‘ఐ’ సినిమా భోగి పండగ రోజున విడుదలకానుంది. దీంతో పండక్కి డబల్ ధమాకా కన్ఫర్మ్ అని సంబరాలు మొదలుపెట్టారు.

సంక్రాంతి శెలవులు ఈ నెల 18 వరకూ వుండడంతో ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి బిజినెస్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ‘ఐ’ సినిమాలో విక్రమ్ సరసన అమీ జాక్సన్ నటించింది. ఈ సినిమాలో చియాన్ మూడు విభిన్న పాత్రలలో అలరించనున్నాడు

 
Like us on Facebook