ఇంటర్వ్యూ : తాప్సి – బాలీవుడ్ సినిమాలకంటే తెలుగు సినిమాలే బాగా ఆడుతున్నాయి !

ఇంటర్వ్యూ : తాప్సి – బాలీవుడ్ సినిమాలకంటే తెలుగు సినిమాలే బాగా ఆడుతున్నాయి !

Published on Aug 17, 2017 4:44 PM IST


మహి వి రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆనందో బ్రహ్మ’. సినిమా రేపు రిలీజ్ కానున్న సందర్బంగా చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటి తాప్సి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం..

ప్ర) మీకు హర్రర్ సినిమాలంటే బాగా ఇష్టమా ఎక్కువ చేస్తున్నారు ?
జ) నాకు హర్రర్ సినిమాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎక్కువ చూడను కూడా. ఇక ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానంటే ఇది హర్రర్ కామెడీ కనుక.

ప్ర) రాఘవన్ కథ చెప్పగానే ఏమనిపించింది ?
జ) మహి వి రాఘవన్ కథ చెప్పిన 5 నిముషాలకే ఒప్పేసుకున్నాను. ఎందుకంటే కాన్సెప్ట్ అంత కొత్తగా అనిపించింది. ఎందుకంటే మామూలుగా దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు కానీ ఇందులో మనుషుల్ని చూసి దెయ్యాలు భయపడతాయి. ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది.

ప్ర) ఈ సినిమా స్క్రిప్ట్ లో ఏమైనా సజషన్స్ ఇచ్చారా ?
జ) సాధారణంగా సౌత్ సినిమాకి పనిచేసేప్పుడు స్క్రిప్ట్స్ లో నేను పెద్దగా ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే నాకు బాష పెద్దగా రాదు కాబట్టి. కానీ ఈ సినిమాలో మాత్రం డైరెక్టర్ మహి చాలా సీన్లు ఎలా తీస్తే బాగుంటుందో చెప్పమని నన్ను అడిగేవాడు. నేను చెప్పినవి బాగుంటే చేయడమో బాగోలేకుంటే మార్చడమే చేసేవాడు. అంటే దర్శకుడిని కాబట్టి అంతా నేనే అనే భావన అతనిలో ఉండేది కాదు.

ప్ర) ఇకపై కూడా ప్రతి తెలుగు సినిమాలకి ఇలాగే ప్రమోషన్స్ చేస్తారు ?
జ) అంటే ఈ సినిమాలో పెద్ద హీరో లేడు. కాబట్టి సినిమాలోని డిఫరెంట్ కాన్సెప్ట్ నే బేస్ చేసుకుని ప్రమోషన్లు చేయాలని నిర్ణయించుకుని ఇలా చేస్తున్నాం. సినిమా జనాలకు రీచ్ అవ్వాలంటే ప్రమోషన్లు చేయాల్సిందే. ఇకపై కూడా నా సినిమాలకు ఇలానే చేస్తాను.

ప్ర) సినిమాల విషయంలో మీ అభిప్రాయం ఎప్పుడు మారింది ?
జ) ఇంతకు ముందు ఏ సినిమా వచ్చినా చేసేదాన్ని. అప్పుడు పెద్దగా సక్సెస్ ఉండేది కాదు. అందుకే 2, 3 సంవత్సరాల నుండి నాకు నచ్చిన సినిమాలు, చేయాలనుకున్న సినిమాలు మాత్రమే చేస్తున్నాను. అందుకే సక్సెస్ లు వస్తున్నాయి.

ప్ర) అంటే ఇకపై కమర్షియల్ సినిమాలు చేయరా ?
జ) ఎందుకు చేయను. నేను కమర్షియల్ సినిమాలు చూస్తూనే పెరిగాను. మంచివైతే గ్లామర్ రోల్స్, కమర్షియల్ మూవీస్ చేయడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు.

ప్ర) ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం ?
జ) డిఫరెంట్ కాన్సెప్ట్. అదే నేను ఈ సినిమాకి ఒప్పుకునేలా చేసింది. ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని జానర్ సినిమా. బాగుంటుందనిపించి చేశాను. నిజానికి నేనీ సినిమా చేస్తున్నానంటే నా కో-స్టార్స్ కూడా నమ్మలేకపోయారు.

ప్ర) హిందీలో రెండు హిట్లు దక్కాయి కదా ఇప్పుడు మీకు స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిందని మీరు భావిస్తున్నారా ?
జ) లేదు. నాకు నేను ఎప్పుడూ స్టార్ అని ఫీలవ్వను. ఎందుకంటే ప్రతి రోజు కష్టపడాల్సిందే. కొత్త, మంచి స్క్రిట్స్ వెతుక్కోవాలి, అవి చేయగలనని ఎదుటివాళ్లను నమ్మించాలి, జనాల్ని థియేటర్లకు వచ్చేలా చేయాలి. ఇన్ని పనుల మధ్య స్టార్ అనే భావనే నాకు రాదు.

ప్ర) మహి వి రాఘవన్ తో వర్క్ ఎలా ఉంది ?
జ) మంచి క్లారిటీ ఉన్న దర్శకుడు. తనకేం కావాలో తనకు బాగా తెలుసు. కష్టపడతాడు. నేను డైరెక్టర్ అనే ఫీలింగ్తో అస్సలు ఉండడు. తనని తానే క్రిటిసైజ్ చేసుకుంటాడు. దాంతో బెస్ట్ ఔట్ ఫుట్ ఇవ్వగలడు.

ప్ర) ఇంకో మెట్టు ఎదగడం కోసమే బాలీవుడ్ లోకి వెళ్ళారా ?
జ) అదేం లేదు. అయినా టాలీవుడ్ కన్నా బాలీవుడ్ గొప్పని ఎవరు చెప్పారు. వాస్తవంగా చూసుకుంటే హిందీ సినిమాలకన్నా తెలుగు సినిమాలే బాగా కలెక్ట్ చేస్తున్నాయి. టాలీవుడ్ మంచి లాభాల్లో ఉంది. ఈ సంవత్సరం చాలా బాలీవుడ్ సినిమాలు సరిగా ఆడలేదు.

ప్ర) బాలీవుడ్ స్టార్ హీరోలు ఎందుకు విఫలమవుతున్నారు ?
జ) వాళ్ళు భిన్నంగా ట్రై చేస్తున్నారు. కానీ ప్రేక్షకులకు ఏం కావాలో తెలుసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారని నా అభిప్రాయం.

ప్ర) మీ డ్రీమ్ రోల్ ఏంటి ?
జ) డ్రీమ్ రోల్ అంటూ ఏం లేదు. నాకు స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే స్పోర్ట్స్ బయోపిక్ చేయాలని ఉంది.

ప్ర) మీ కెరీర్లో మీ గోల్ ఏంటి ?
జ) నేను చేసిన సినిమాకు వెళితే కొన్న టికెట్ కు న్యాయం జరుగుతుందని ఆడియన్స్ నమ్మేలా చేయాలి. అదే నా కెరీర్లో నా గోల్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు