సాయి కొర్రపాటి లాంటి నిర్మాతలు కావాలి – నాగార్జున

సాయి కొర్రపాటి లాంటి నిర్మాతలు కావాలి – నాగార్జున

Published on Sep 20, 2014 9:50 AM IST

nagarjuna

‘ఈగ’ సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమైనా సాయి కొర్రపాటి ఆ తర్వాత కథా బలం ఉన్న సినిమాలు ఎంచుకుంటూ చేసిన అందాల రాక్షసి, లెజెండ్, ఊహలు గుసగుసలాడే సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం ‘లెజెండ్’, ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాలతో విజయం అందుకున్న సాయి కొర్రపాటి సమర్పణలో ఈ సంవత్సరం చేస్తున్న మూడవ సినిమా ‘దిక్కులు చూడకు రామయ్య’. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో నిన్న పలువురు అతిధుల సమక్షంలో జరిగింది.

ఈ వేడుకలో నాగార్జున మాట్లాడుతూ ‘కథను నమ్మి సినిమాలు తీస్తే సినిమాలు పెద్ద హిట్ అవుతాయి. అదే ఫార్ములాని ఫాలో అవుతున్న నిర్మాత సాయి కొర్రపాటి అందుకే వరుస హిట్స్ అందుకుంటున్నాడు. ఇలాంటి నిర్మాటాలి తెలుగు ఇండస్ట్రీకి చాలా అవసరం. త్రికోటి నాకు రానజ్జ నుంచి తెలుసు ఈ సినిమా తర్వాత తనతో సినిమా చేస్తానని’ అన్నాడు.

రాజమౌళి మాట్లాడుతూ ‘నేను అసిస్టెంట్ గా పనిచేసేటప్పుడు నా సీనియర్ త్రికోటి గారు, ఆ తర్వాత నా సినిమాకు నాకు రైట్ హ్యాండ్ లా పనిచేసారు. ఈ సినిమా ఆయనకి పెద్ద హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నానని’ అన్నాడు.

నాగ శౌర్య, సన జంటగా నటించిన ఈ సినిమాకి త్రికోటి దర్శకుడు. సాయి కొర్రపాటి సమర్పణలో రజిని కొర్రపాటి నిర్మించిన ఈ మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు